సహాయము  కావాలి

మైత్రి అనేది శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉన్న ఒక ఉచిత, విశ్వసనీయమైన, లాభాపేక్షలేని సంస్థ. ఇది ప్రధానంగా దక్షిణ ఆసియా (బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాలు) నుండి వచ్చిన కుటుంబాలకు మరియు వ్యక్తులకు సేవ చేసె సంస్థ. వీరు యెవరైనా గృహహింస, మానసిక హింస, భావొద్వేగ ఒత్తిళ్ళు, సాంస్కృతిక పరాయికరణ,  కుటుంబ కలహాలు లాంటి బాధలకు గురి అయితె ఈ సంస్థను సంప్రదించి సహాయము పొందవచ్చు.

మీరు లేదా మీకు తెలిసిన వారు కాని ఎవరైనా పైన తెలిపినటువంటి బాధలకు గురి అవుతున్నారా? సహాయము  కావాలా?

1-(888)-862-4874 నంబరికి ఫొను చేయ్యండి.

ఎవరితొనైన మాట్లాడాలని అనుకుంటె సోమవారము నుండి శుక్రవారము రోజులలొ ఉదయము 9 నుండి మధ్యాహ్నము 3 గంటలలొపు పై తెలిపిన నంబరుకు ఫొను చెయ్యండి. లేకపోతే, దయచేసి మిమ్మల్ని చేరుకోవడానికి సురక్షితమైన ఫోన్ నంబర్ మరియు సురక్షిత సమయంతో పాటు వివరణాత్మక సందేశాన్ని వదలండి. మా వాలంటీర్లు వాయిస్ సందేశాలను స్వీకరించిన 24 గంటల్లో తనిఖీ చేసి వాటికి ప్రతిస్పందిస్తారు.

ఇది ఒకవేళ అత్యవసర పరిస్థితి అయితె లేదా మీకు యేమన్నా గాయమైతే, వెంటనే 911 కు కాల్ చేయండి. మీకు సహాయం చేయడానికి పోలీసులు ఇక్కడ ఉన్నారు. మీరు మాట్లాడలేకపోతే, 911 డయల్ చేసి, మాట్లడకుండా ఉండండి, ఫొను పెట్టి వేయకండి. పోలీసులు వెంటనే సహాయం పంపుతారు.

మీ కాల్‌కు సమాధానం ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము:

  • మీరు పైన తెలిపిన బాధలతొ కష్టపడుతుంటె -- భద్రతా ప్రణాళికతో మేము మీకు సహాయం చేయవచ్చు మరియు మీ ఎంపికలను వివరించవచ్చు

  • మీకు ప్రశ్నలు ఉంటే -- మేము వాటికి సమాధానం ఇస్తాము లేదా తగిన సలహా ఇచ్చే  వారిని మీకు సూచిస్తాము.

  • మీరు ఎవరితొనైనా మాట్లాడి నిర్ణయము తీసుకోవాలని ఉంటె -- మేము మిమ్మల్ని వ్యక్తిగత పీర్ కౌన్సెలర్‌తో జత చేయవచ్చు

  • మీరు చట్టపరమైన సహాయం కోసం చూస్తున్నట్లయితే -- నిరోధక ఆర్డర్ వ్రాతపనికి, కోర్టు విచారణల తయారి కొరకు, కోర్టు వెళ్ళడానికి తొడుసహాయకుల కొరకు, న్యాయవాదులను సిఫారసు చెయ్యడానికి మరియు ఇతర చట్టపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో మేము సహాయపడతాము.

  • మీకు భాషా సమస్యలు ఉంటే మరియు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే -- మాకు అనేక దక్షిణాసియా భాషలు మాట్లాడే వాలంటీర్లు ఉన్నారు